Bhatti Vikramarka : యూపీఎస్సీలో తెలంగాణ యువత విజయాలు సాధించాలి: భట్టి విక్రమార్క

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-05 06:32:41.0  )
Bhatti Vikramarka : యూపీఎస్సీలో తెలంగాణ యువత విజయాలు సాధించాలి: భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ యువతను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పరీక్షల్లో ప్రోత్సహించేందుకు, ఉన్నత విద్యను అందుకునేందుకు రాష్ట్ర పభుత్వం పలు ప్రోత్సాహా పథకాలు అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)తెలిపారు. ప్రజాభవన్ లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం(Rajiv Gandhi Civils Abhaya Hastham) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరై మాట్లాడారు. భట్టి మాట్లాడుతూ ఉద్యోగ కల్పన ప్రధాన లక్ష్యంగా మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు.

యూపీఎస్సీ(UPSC)లో మన విద్యార్థులు రాణించాలని ప్రభుత్వం వారిని ప్రోత్సహించేందుకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం అమలు చేస్తుందన్నారు. సివిల్స్ లో 40మందిలో మెయిన్స్ నుంచి ఉత్తీర్ణత సాధించి 20మంది ఇంటర్వ్యూకు ఎంపికవ్వడం అభినందనీయమన్నారు. రాష్ట్రం నుంచి ఇంటర్వ్యూలకు వెళ్లే వారిని చూస్తే గర్వంగా ఉందని, ఖర్చుల నిమిత్తం 20మందికి రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. మెయిన్స్ వాళ్లకు లక్ష ఆర్ధిక సహాయం చేయడంతో పాటు ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి మరో లక్ష సహాయం చేయాలని నిర్ణయించిందన్నారు. మీతల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం కూడా మీరు సెలక్ట్ కావాలని బలంగా కోరుకుంటోందన్నారు. మీరు ఎక్కడున్నా రాష్ట్ర ప్రగతికి మీవంతు తోడ్పాటునందించాలని కోరారు. ఇంటర్వ్యూలకు వెళ్లే వారికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ గెస్ట్ హౌస్ లలో వసతి కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

సింగరేణి కాలరీస్ ను గత ప్రభుత్వం మాదిరిగా సొంత రాజకీయాలకు, ఆర్థిక అవసరాలకు దుర్వినియోగం చేయడం మా ప్రభుత్వం చేయబోదని స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తు్న్నామని, అందులో భాగంగా కోటీ రూపాయల బీమా వసతిని ఏర్పాటు చేశామని, దీన్ని 1కోటీ 20లక్షలకు పెంచుతున్నామని భట్టి వెల్లడించారు. సింగరేణి సంస్థను ఇతర రాష్ట్రాలకు విస్తరించి బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పపంచం థర్మల్ నుంచి గ్రీన్ ఎనర్జీ వైపు వెలుతున్న క్రమంలో సింగరేణిని ప్రత్యామ్నాయ రంగాలవైపు అప్ డేట్ చేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సింగరేణి సీఎండీ బలరాం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed