ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్..విజయవాడలో కలకలం

by srinivas |   ( Updated:2025-01-05 06:24:14.0  )
ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్..విజయవాడలో కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ సంచలనంగా మారింది. బయటకు వెళ్తున్నామని చెప్పిన వెళ్లిన బాలికలు ఎంతకి తిరిగరాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. స్థానికంగా గాలించి చూశారు. కానీ ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికల పేర్లు, వివరాలు పోలీసులకు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాలికల కోసం గాలిస్తున్నారు.

అయితే ఇంకా బాలికల ఆచూకీ గుర్తించకపోవడంతో బాలికలకు ఏమైందోనని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. త్వరగా తమ పిల్లలను గుర్తించాలని కోరుతున్నారు. మరోవైపు బాలికల అదృశ్యం మిస్టరీగా మారింది. నున్నలో ఆరో తరగతి చదవుతున్న ఇద్దరు విద్యార్థులు ఇంటి నుంచి వెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజుల్లో కనిపించాయి. ఆ తర్వాత కొంతదూరం వెళ్లిన తర్వాత కనిపించలేదు. దీంతో పోలీసులు బృందాలుగా గాలిస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ ఆచూకీలేదు. ఈ మిస్సింగ్ స్థానికంగా కలకలం రేపింది. అయితే త్వరగా కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed