- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసిందోచ్.. బాలయ్య, రామ్ చరణ్ ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదుగా
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం నాలుగో సీజన్ కూడా విజయవంతంగా రన్ అవుతోంది. ఇక ఇప్పటికే ఏడు ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ షో కి రీసెంట్‌గా రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ సినిమా ప్రమోషన్లలో భాగంగా వచ్చారు. కాగా ఈ చిత్రం జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేసింది ఆహా టీమ్. అయితే ఈ ఎపిసోడ్‌కి చరణ్‌తో పాటు హీరో శర్వానంద్, దిల్‌రాజు, నిర్మాత విక్రమ్ కూడా వచ్చారు.
ఇక ఎపిసోడ్ విషయానికి వస్తే అంత ఫుల్ ఎంటర్టైన్మెంట్‌గా సరదా సరదాగా సాగింది. అలాగే ప్రోమో చూసినట్లయితే.. చరణ్.. తన తల్లి, నానమ్మతో వీడియో కాల్‌లో మాట్లాడాడు. అప్పుడు వాళ్ళు మాకు 2025లో ఒక మనవడు కావాలని అడుగుతారు. ఇక చరణ్ కూతురు క్లీంకార గురించి, ఉపాసన గురించి మాట్లాడాడు. అలాగే హీరో శర్వానంద్ కూడా వచ్చి చరణ్‌తో ఫ్రెండ్షిప్ గురించి పంచుకున్నాడు. అంతేకాకుండా చరణ్ ప్రభాస్‌కి కాల్ చేసి మాట్లాడారు. ఫైనల్‌గా దిల్ రాజు కూడా వచ్చి పార్టీ చేసుకుందాం అన్నారు. ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ జనవరి 8న రిలీజ్ చేయనున్నారు. దీనికోసం అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.