తెలంగాణ నిరుద్యోగులకు BIG అలర్ట్.. CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
తెలంగాణ నిరుద్యోగులకు BIG అలర్ట్.. CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: జ్యోతిబాపూలే ప్రజాభవన్‌(Praja Bhavan)లో రాజీవ్ సివిల్స్ అభయహస్తం(Rajiv Gandhi Civils Abhayahastam) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్స్‌కు ప్రిపేరవుతున్న విద్యార్థులకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యువత సహకారంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. అందులో భాగంగా ప్రగతి భవన్.. ప్రజాభవన్‌గా మారిందని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. అత్యంత వెనుకబడిన బిహార్(Bihar) రాష్ట్రం నుంచి అనేకమంది సివిల్స్‌కు ఎంపిక అవుతున్నారు.. ఇక్కడ కూడా అలాంటి సహకారం అందించాలనే ఆలోచనతోనే సివిల్స్‌ అభ్యర్థులకు సాయం చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్(Congrss Govt) అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఎన్నడూ లేనివిధంగా 563 గ్రూపు-1 పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పారు. తాము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే.. కోర్టుల్లో కేసులు వేస్తూ విపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పదేళ్లు కాలయాపన చేసిందని విమర్శించారు. నాడు నిరుద్యోగుల బాధలు కళ్లారా చూశాం కాబట్టే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. సివిల్స్ అభ్యర్థులకు తాము చేసేది ఆర్థిక సాయం కాదని.. ప్రభుత్వం వారికి అందిస్తున్న ప్రోత్సాహంగా భావించాలని అన్నారు. కష్టంతో కమిట్మెంట్ ఉంటేనే విజయం వరిస్తుందని సూచించారు. ఇంటర్వ్యూకు వెళ్లే ప్రతీ ఒక్కరూ సివిల్స్‌లో సెలెక్ట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు.. మార్చి 31లోగా 563 గ్రూప్-1 ఉద్యోగాల నియామకాలను పూర్తిచేయబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed