- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘పది’ పరీక్షలు.. విస్తృతంగా తనిఖీలు

X
దిశ, మంగపేట: మండలంలోని మంగపేట, కమలాపురం, రాజుపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పది పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.00 గంటలకు విద్యార్థులు, తల్లిదండ్రులు చేరుకుని తమ సెంటర్లలోని సీట్లను పరిశీలించుకున్నారు. మూడు సెంటర్లలో 380 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా ఉదయం 9.30 గంటలకు సెంటర్లలోకి పంపుతూ ఇన్విజిలేటర్లు విద్యార్థులను తనిఖీలు చేసి ‘ఆల్ ద బెస్ట్’ చెప్పారు. 3 సెంటర్లల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని ఎస్సై టీవీఆర్ సూరి తెలిపారు. ప్రతి సెంటర్ వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హెడ్ కానిస్టేబుల్ పహారా ఉంటుందని తెలిపారు. విద్యార్థులను ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి తల్లి తండ్రులు సహకరించాలని పరీక్షా కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో ఉండి మాస్ కాపీయింగ్ జరగకుండా సహకరించాలన్నారు.
Next Story