Nicolas Puech: ఇంట్లో తోటమాలికి కోట్ల రూపాయల ఆస్తి రాసిచ్చాడు.. ఎందుకిలా చేశాడు? ఎవరితను?

by Vennela |
Nicolas Puech: ఇంట్లో తోటమాలికి కోట్ల రూపాయల ఆస్తి రాసిచ్చాడు.. ఎందుకిలా చేశాడు? ఎవరితను?
X

దిశ, వెబ్ డెస్క్: Nicolas Puech: ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక.. పాత తెలుగు సినిమాలో ఓ పాట ఉంది. ఇలా అయిన వారిపై విసుగు చెందిన ఓ బిలియనీర్ తన ఆస్తిని తన దగ్గర పనిచేసే వ్యక్తికి రాసిచ్చాడు. ఇంతకీ ఆయన ఆస్తి ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఏకంగా రూ. 91వేల కోట్ల విలువైన ఆస్తి. దీనికోసం అతన్ని దత్తత తీసుకున్నాడు. ఈ వ్యవహారం స్విట్జర్లాండ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

స్విట్జర్లాండ్ లో ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ ఉత్పత్తుల కంపెనీ హెర్పస్ ను స్థాపించిన థియరీ హెర్మెస్ మనవడు 80ఏళ్ల నికోలస్ ప్యూచ్ తన దగ్గర పనిచేసే 51ఏళ్ల తోటమాలిని దత్తత తీసుకున్నాడు. అతనికి 11 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 91వేల కోట్ల సంపదను అప్పగించాలని యోచిస్తున్నట్లు ట్రిబ్యూనల్ డి జెనీవ్ ఫ్యార్చ్యూన్ అనే స్విస్ పత్రిక పేర్కొంది. అయితే హెర్మస్ కంపెనీ థియరీ హెర్మస్ 1837లో స్థాపించారు. థియరీ హెర్మెస్ కుటుంబంలో ఐదవ తరం వారసుడే నికోసల్ ప్యూచ్. ఈయన కంపెనీలో 9 బిలియన్ నుంచి 10 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ విలువైన 5 నుంచి 6శాతం వాటా కలిగి ఉన్నారు. అయితే నికోలస కు పెళ్లి, పిల్లలు లేరు. దీంతో ఆయన తన తన తర్వాత సంపదను తన దగ్గర పనిచేస్తున్న మాజీ తోటమాలికి రాసిచ్చే ప్రక్రియలో ఉన్నారు. దీనికోసం న్యాయవాదులను కూడా నియమించారు.

అయితే నికోలస్ దత్తత తీసుకుని ఆస్తిని రాసివ్వాలనుకుంటున్న వ్యక్తి పేరు మాత్రం వెల్లడించలేదు. ఆయన స్పానిష్ మహిళను వివాహం చేసుకున్నట్లు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ వ్యక్తికి నికోలస్ 5.9 మిలియన్ డాలర్లు అంటే రూ. 49కోట్ల విలువైన ఆస్తిని ఇచ్చారు. ఇందులో మొరాకోలోని మరకేష్ లోని ఆస్తి, స్విట్జర్లాండ్ లోని మాంట్రీక్స్ లోని ఒక విల్లా కూడా ఉన్నాయి. అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు తన ఆస్తిని ఐసో క్రటీస్ ఫౌండెషన్ కు ఇవ్వాలని అనుకున్నాడు. ఇది ప్రజా ప్రయోజన జర్నలిజానికి మద్దతు ఇచ్చేందుకు అతను స్థాపించిన సంస్థ.

Next Story