Kadapa: కేసీ కెనాల్‌ భూముల కబ్జా... 20 మంది అధికారులపై చర్యలకు ఉత్తర్వులు

by srinivas |   ( Updated:2024-10-30 14:22:45.0  )
Kadapa: కేసీ కెనాల్‌ భూముల కబ్జా... 20 మంది అధికారులపై చర్యలకు ఉత్తర్వులు
X

దిశ, వెబ్ డెస్క్: 20 మంది అధికారులపై ఏపీ ప్రభుత్వం(AP Govt) సీరియస్ అయింది. కడప కేసీ కెనాల్‌(Kadapa KC Canal) భూ కబ్జాపై అలసత్వం, ప్రమేయంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అధికారులపై క్రమశిక్షణ చర్యలకు దిగింది. కేసీ కెనాల్ ఇంజనీర్లు, ప్లానింగ్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లకు సమన్లు జారీ చేసింది. కాగా కడప జిల్లాకు వరప్రదాయని అయిన కేసీ కెనాల్ భూముల్లో గత ప్రభుత్వ హయాంలో కొందరు అక్రమంగా కట్టడాలు నిర్మించారు. అయితే అక్రమ కట్టడాలను పరిశీలించిన అధికారులు స్థానిక నేతల ఒత్తిడితో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో వారందరిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఎవరెవరి పాత్ర ఉందో ఉన్నతాధికారుల ద్వారా లిస్టు తెప్పించుకుంది. ఈ మేరకు చర్యలకు ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed