- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Firecracker shops : అనుమతి లేకుండా పటాకుల దుకాణాలు
దిశ ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో టపాకాయల దుకాణాల దందా హిస్టారీతిగా కొనసాగుతోంది. మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన సమయంలో ఏరియాలోని ఉన్న ప్రజలకే ఆర్మూర్ లోని రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, అగ్నిమాపక శాఖల అధికారులు అనుమతులను కేటాయిస్తూ.. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలతో మైదాన ప్రాంతంలో టపాకాయల దుకాణాలను దీపావళి సందర్భంగా.. ఏర్పాటు చేయిస్తున్నారు. కానీ ఆర్మూర్ మున్సిపల్ లో వీలినమైన మామిడిపల్లి, పెర్కిట్, కోటార్ మూర్ ఏరియాలోని మున్సిపల్ వార్డుల్లో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా జనావాసాల రద్దీప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలో వారి వారి దుకాణాల ముందు టపాకాయల స్టాళ్లను దర్జాగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ ఏరియాల్లో అనుమతులు తీసుకొని దుకాణాలను ఏర్పాటు చేయించాలన్న తపన ఆ నాలుగు శాఖల ప్రభుత్వాధికారులకు కొసమెంతయిన ఉన్నట్లు కనబడడం లేదు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో సుమారు 40 టపాకాయల దుకాణాలకు అనుమతులు తీసుకోగా.. సుమారు 50 నుంచి 60 స్టాళ్లను ఏర్పాటు చేయిస్తూ దర్జాగా దుకాణాల పేరిట దండుకుంటున్నారు. ఇవి మాత్రమే కాకుండా మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాల్లో ఆర్మూర్లో అనుమతులు తీసుకున్న 40 దుకాణాలకు రెట్టింపు దుకాణాలను ఎలాంటి అనుమతులు లేకుండా సదరు టపాకాయల దందాను కొనసాగిస్తున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా టపాకాయల దుకాణాలను రద్దీ ప్రాంతాలో ఏర్పాటు చేస్తున్న ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేస్తే అనుకోని సందర్భంలో ప్రమాదం సంభవిస్తే ..దీనికి బాధ్యత ఎవరు వయస్తారన్న చర్చ ఆర్మూర్లో విస్తృతంగా జరుగుతుంది. ఆర్మూర్ మున్సిపల్ లో అనుమతులు తీసుకున్న దుకాణాల్లో ఎలాంటి సంఖ్య పెరగకుండా తీసుకున్న ప్రకారమే.. దుకాణాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా వీలిన గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఏళ్లుగా చేపడుతున్న టపాకాయల దందా లను టపాకాయల దుకాణాల నిర్వహకులు స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమై రంగం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆర్మూర్ మున్సిపల్ వీలిన గ్రామాల్లో ఎలాంటి లైసెన్సులు లేకుండా టపాకాయల స్టాళ్లను ఏర్పాటు చేసే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
-ఆర్మూర్ లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలకు తూట్లు.. పడ్డట్టేనా..?
జనావాసాల ప్రాంతాల్లో టపాసుల దుకాణాలు ఉండొద్దని, మైదాన ప్రాంతాల్లోనే దీపావళి సందర్భంగా.. టాపాకాయల దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలకు తూట్లు.. పడ్డట్టేనా..అన్నట్లు వాస్తవ పరిస్థితి తెలుస్తుందని ఆర్మూర్ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఆర్మూర్ లో వీలీన గ్రామాలైన మూడు ఏరియాల్లో సుమారు 7 సంవత్సరాలుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్మూర్ మున్సిపల్ లో కలిసిన అప్పటి నుంచి టపాకాయల దందాను సదరు నిర్వాహకులు దర్జాగా కొనసాగిస్తున్నారు. కానీ రాష్ట్ర మంత్రి ప్రజల బాగోగుల కోసం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మైదాన ప్రాంతాల్లోని టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని ,జనావాసాల ప్రాంతాల్లో ఆ దుకాణాలు ఏర్పాటు చేయకుండా చూడాలని ఆదేశించారు. కానీ ఆర్మూర్ మున్సిపల్ వీలిన గ్రామాల్లో మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా జనాభాసాల ప్రాంతాల్లోనే సామాన్య దుకాణాల ముందరనే దర్జాగా టపాకాయల దందాలను ఏళ్లుగా నిర్వహిస్తున్నారు.