Tdp Vs Ycp: జ‌మ్మల‌మ‌డుగులో ఉద్రిక్తత... భారీగా పోలీసుల మోహరింపు

by srinivas |   ( Updated:2024-10-30 11:54:23.0  )
Tdp Vs Ycp:  జ‌మ్మల‌మ‌డుగులో ఉద్రిక్తత... భారీగా పోలీసుల మోహరింపు
X

దిశ, వెబ్ డెస్క్: క‌డ‌ప జిల్లా జ‌మ్మల‌మ‌డుగు నియోజకవర్గం(Jammalamadugu Constituency)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్దదండ్లూరులో వైసీపీ నేత హనుమంతరెడ్డి(YCP leader Hanumantha Reddy)తో పాటు ఆయన అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీ నేత‌ల‌(TDP leaders)పై మార‌ణాయుధాల‌తో దాడి చేశారు. అయితే టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించారు. దీంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఇరువ‌ర్గాలకు చెందిన నాయ‌కులకు గాయాలయ్యాయి. ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉండటంతో జ‌మ్మల‌మ‌డుగు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరోసారి ఘర్షణలు చెలరేగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. సాధారణ పరిస్థితికి వచ్చే వరకు గ్రామంలో కఠిన ఆంక్షలు విధించారు.

Advertisement

Next Story

Most Viewed