Manakondur MLA : సింగిల్ విండోలు బలోపేతమైతేనే రైతులకు మేలు..

by Aamani |
Manakondur MLA : సింగిల్ విండోలు బలోపేతమైతేనే రైతులకు మేలు..
X

దిశ, తిమ్మాపూర్ : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సింగిల్ విండోలు) ఆర్థికంగా బలోపేతమైనప్పుడు రైతులకు మరింత మేలు జరుగుతుందని మానకొండూర్ ఎమ్మెల్యే (Manakondur MLA) కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.బుధవారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలోని సింగిల్ విండో ఆధ్వర్యంలో పెట్రోల్ పంప్ నుంచి రిటైల్ అవుట్ లెట్ ను ఆయన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ కొండూరి రవీందర్ రావు తో కలిసి పున:ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్ విండోల అభివృద్ధిలో సంఘ సభ్యులు భాగస్వామ్యం కావాలన్నారు. ఈ బంక్ విజయవంతంగా నడిస్తే సింగిల్ విండో ఆర్థికంగా బలోపేతం అవుతుందని, తద్వారా సంఘ సభ్యులైన రైతులు ప్రయోజనం పొందగలుగుతారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి చెందిన వాహనదారులు, ట్రాక్టర్ల యజమానులు,సంఘ సభ్యులు ఈ బంక్ ఇంధనం వాడాలని ఆయన కోరారు. సంఘ భవన నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళతానని, స్థల సేకరణ, భవన నిర్మాణానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ డైరెక్టర్ అలువాల కోటి, సింగిల్ విండో చైర్మన్ (Chairman)గుజ్జుల రవీందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోర పల్లి రమణారెడ్డి, మాజీ సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, మాజీ ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోగూరి నరసింహారెడ్డి, బుధారపు శ్రీనివాస్, ఎస్.కొండల్ రావు, చిరంజీవి, బండారి రమేష్,ఆశిక్ పాషా తోపాటు సింగిల్ విండో అధికారులు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story