Lac: తూర్పు లడఖ్‌లో కీలక పరిణామం.. భారత్, చైనా దళాల ఉపసంహరణ

by vinod kumar |
Lac: తూర్పు లడఖ్‌లో కీలక పరిణామం.. భారత్, చైనా దళాల ఉపసంహరణ
X

దిశ, నేషనల్ బ్యూరో: సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్(India), చైనా(china)ల మధ్య ఇటీవల ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇరుదేశాలు తమ సైన్యాలను తూర్పు లడఖ్ నుంచి ఉపసంహరించుకోవడం ప్రారంభించాయి. దేప్‌సాంగ్ (Depsang), డెమ్‌చౌక్‌ (Demchok) లలో ఇరు దేశాల జవాన్లను తొలగించే ప్రక్రియ దాదాపు పూర్తైనట్టు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. డెమ్‌చౌక్‌లో రెండు వైపుల నుంచి అనేక టెంట్లు తొలగించబడ్డట్టు పేర్కొన్నాయి. ఇరుపక్షాల సమన్వయంతో కూడిన పెట్రోలింగ్ సైతం త్వరలో ప్రారంభమవుతుందని వెల్లడించాయి. అంతేగాక దీపావళి పండుగ సందర్భంగా ఇరు వర్గాలు స్వీట్లు తినిపించుకోనున్నట్టు తెలుస్తోంది. భారత్, చైనా దళాలు వారి స్థానాలు, మౌలిక సదుపాయాల తొలగింపును పరస్పరం వెరిఫై చేస్తున్నట్టు సమాచారం.

మరోవైపు, తూర్పు లడఖ్‌లో వాస్తవ నియంత్రణ రేఖ (Lac) వెంబడి చైనా, భారత సైన్యాలు క్రమపద్ధతిలో బలగాల ఉపసంహరణకు సంబంధించిన ప్రతిపాదనలను అమలు చేస్తున్నాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్(Lin jiyaan) బుధవారం తెలిపారు. సరిహద్దు సంబంధిత సమస్యలపై ఇరు దేశాలు ఒక పరిష్కారానికి చేరుకున్నాయని చెప్పారు. కాగా, ఈ నెల 21న భారత్, చైనా మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. తూర్పు లడఖ్‌లోని ఎల్ఏసీ వద్ద ఏప్రిల్ 2020కి ముందున్న యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి రెండు దేశాలు అంగీకరించాయి.

Advertisement

Next Story

Most Viewed