జన్వాడా ఫామ్ హౌస్‌కు రాజ్ పాకాలను తీసుకెళ్లిన పోలీసులు

by Mahesh |
జన్వాడా ఫామ్ హౌస్‌కు రాజ్ పాకాలను తీసుకెళ్లిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 27 శనివారం రాత్రి జన్వాడ ఫామ్‌హౌస్‌(Janwada Farm House)లో జరిగిన పార్టీ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు.. సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇదే కేసులో కోర్టు అనుమతి అనంతరం రెండు రోజుల తర్వాత రాజ్ పాకాల( Raj Pakas).. పోలీసుల విచారణ(Police investigation)కు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఆయన్ను జన్వాడా ఫామ్ హౌస్‌కు తీసుకెళ్లి మరోసారి మోకిల పోలీసులు(mokila police) తనిఖీలు నిర్వహించారు. రెండు గంటల పాటు నిర్వహించిన తనిఖీల్లో.. ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో.. రాజ్‌ పాకాలను మళ్లీ పీఎస్‌కు తీసుకొచ్చారు. అలాగే ఇదే కేసులో విజయ్‌ మద్దూరి(Vijay Maddhuri) స్టేట్‌మెంట్ ఆధారంగా చేసుకొని రాజ్ పాకాలను విచారిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే అతని మొబైల్‌ ఫోన్ కోసం ఆరా తీస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed