- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మేడ్చల్ జిల్లాలో అనూహ్యంగా పెరిగిన ఓటర్లు..
దిశ, మేడ్చల్ బ్యూరో : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల విభాగం ప్రకటించింది. దాని ప్రకారం.. ఫిబ్రవరి 8,2024 నాటి ఓటరు జాబితాతో పొలిస్తే జిల్లా వ్యాప్తంగా ఓటర్లు ఘననీయంగా పెరిగారు.ఈ జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్లు 29 లక్షల 42 వేల 383 గా తేలింది. వీరిలో పురుష ఓటర్లు 15 లక్షల 15 వేల 125 లుండగా, మహిళా ఓటర్లు 14 లక్షల 26 వేల 857 గాను ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 401 మంది ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు 2435 ఉన్నాయి.ముసాయిదాపై నవంబర్ 28 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తారు. వాటిని పరిష్కరించిన తర్వాత 2025,జనవరి 6వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
జిల్లాలో సర్వీస్ ఓటర్లు క్రితం సారి విడుదల చేసిన డ్రాప్ట్ ప్రకారం 729 గా ఉండగా, ఈసారి ఆ సంఖ్య 735కు చేరింది. అదేవిధంగా మల్కాజ్ గిరిలో అత్యధికంగా 247 మంది సర్వీస్ ఓటర్లు ఉండగా, అత్యల్పంగా కూకట్ పల్లిలో 54 మంది ఉన్నారు.మేడ్చల్ లో 149 మంది పురుషులు, 13 మంది మహిళలు సర్వీస్ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అదేవిధంగా మల్కాజ్ గిరి లో 222 మంది పురుషులు, 25 మంది మహిళలు,కుత్బుల్లాపూర్ లో 90 మంది పురుషులు, 14 మహిళలు, కూకట్ పల్లిలో 51 మంది పురుషులు కేవలం ముగ్గురు మాత్రమే మహిళలు ఉన్నారు. ఉప్పల్ లో 142 మంది పురుషులు, 26 మహిళలు సర్వీస్ ఓటర్లు ఉన్నారు. ఇకపోతే జిల్లాలో ఎన్ ఆర్ ఐ ఓటర్లు 725 మంది ఉన్నారు. వీరిలో మేడ్చల్ లో 29 మంది పురుషులు, ఏడుగురు మహిళలు, మల్కాజ్ గిరి లో 193 మంది పురుషులు, 67 మంది మహిళలు, కుత్బుల్లాపూర్ లో 94 మంది పురుషులు, 18 మంది మహిళలు, కూకట్ పల్లిలో 109 మంది పురుషులు, 27 మంది మహిళలు, ఉప్పల్ లో 136 మంది పురుషులు, 45 మంది మహిళ ఎన్ ఆర్ఐ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.ఈ లెక్కన మల్కాజ్ గిరిలో సర్వీస్, ఎన్ఆర్ఐ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు.
టాప్ లో కుత్బుల్లాపూర్...
ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ప్రకారం జిల్లాలో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండగా, కూకట్ పల్లి చివరి స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం కుత్బుల్లాపూర్ లో ఓటర్ల సంఖ్య ఘననీయంగా పెరుగుతూ వస్తోంది. తాజాగా విడుదల చేసిన ముసాయిదా ప్రకారం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో కుత్బుల్లాపూర్ లోనే అత్యధిక 7 లక్షల 31 వేల 733 మంది ఓటర్లతో మొదటి స్థానంలో నిలిచింది. గత ఫిబ్రవరిలో విడుదల చేసిన ఓటరు జాబితా ప్రకారం కుత్బుల్లాపూర్ ఓటర్లు 6 లక్షల 69 వేల 253 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. తాజా ముసాయిదా ప్రకారం ఓటర్ల సంఖ్య 7 లక్షలు దాటింది. అదేవిధంగా మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో గతంలో 5 లక్షల 95 వేల 382 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం 6 లక్షల 70 వేల 511 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు.ఉప్పల్ లో గత ఓటరు జాబితా ప్రకారం 5 లక్షల 10 వేల 187 మంది ఓటర్లు ఉండగా, తాజా జాబితా ప్రకారం 5 లక్షల 42 వేల 332 మంది ఓటర్లుగా నమోదయ్యారు.
మల్కాజ్ గిరి లో గతంలో 4 లక్షల 68 వేల 822 మంది ఓటర్లు ఉండగా, తాజాగా 5 లక్షల 12 వేల 478 మంది ఓటర్లుగా నమోదయ్యారు. కూకట్ పల్లిలో గతంలో 4 లక్షల 47 వేల 523 మంది ఓటర్లు ఉండగా, తాజా ముసాయిదా ప్రకారం 4 లక్షల 85 వేల 329 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే గత ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 26 లక్షల 91 వేల 167 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం విడుదల చేసిన డ్రాప్ట్ ప్రకారం 29 లక్షల 42 వేల 383 ఓటరుగా నమోదు చేసుకున్నారు. అంటే ఈ లెక్కన 2 లక్షల 51 వేల 216 మంది కొత్తగా ఓటర్ గా నమోదు చేసుకున్నారు. జిల్లాలో ఎన్ ఆర్ ఐ, సర్వీస్ ఓటర్లను ప్రత్యేకంగా లెక్కించారు.