Breaking News : యూట్యూబర్ హర్షసాయికి ముందస్తు బెయిల్ మంజూరు

by M.Rajitha |
Breaking News : యూట్యూబర్ హర్షసాయికి ముందస్తు బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు టాప్ యూట్యూబర్ హర్షసాయి(YouTuber HarshaSai)కి హైకోర్ట్(High Court) ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనపై పెట్టిన లైంగిక వేధింపుల కేసు చెల్లదని హర్ష హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ కేసులో బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై లైంగిక దాడికి పాల్పడ్డడంటూ హర్షసాయిపై ఓ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు యువతి నుండి పలు ఆధారాలను సేకరించారు. అయితే కేసు నమోదు అయినప్పటి నుండి హర్ష పరారీలో ఉన్నాడు. సామాజిక మాధ్యమాల్లో హర్షసాయి తనని కించపరుస్తూ పోస్టులు పెట్టిస్తున్నాడు అంటూ యువతి మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఈ కేసులో పోలీసులు పలువురిని ప్రశ్నించినప్పటికీ.. ఎలాంటి అరెస్టులు, విచారణలు జరగకుండా హర్ష నేడు హైకోర్టు నుండి ముందస్తు బెయిల్ పొందాడు.

Advertisement

Next Story