- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Pratap Reddy:హామీల అమలులో రేవంత్ సర్కార్ విఫలం
దిశ, గజ్వేల్ రూరల్ : ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో రేవంత్ సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి (Vanteru Pratap Reddy)మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎటుచూసినా ధర్నాలతో, రాస్తారోకోలతో, నిండిపోయిందని, ప్రజలు రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారని అన్నారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ పోలీస్ డిపార్ట్మెంట్ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయలేదన్నారు. అంతే కాకుండా సచివాలయం ముట్టడి దేశ చరిత్రలో ఎప్పుడూ కాలేదన్నారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ విధానాలతో పోలీసులు రోడ్డు మీదికి వచ్చి ధర్నాలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులకు ఏక్ పోలీసు విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, పోలీసుల భార్యలు కూడా రోడ్డుమీదికి వచ్చి ధర్నాలు చేయడం రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గత పది నెలల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో రోజుకో ధర్నాతో, నిరసనతో తెలంగాణ రాష్ట్రం అట్టుడుకుతుందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రాక విద్యార్థులు రోడ్డు ఎక్కడం, గురుకుల పాఠశాలలో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులు ధర్నాలు చేయడం, ఏఈఓలు, ఉద్యోగులు ధర్నాలు చేయడం, హైడ్రా భయంతో నిరుపేద ప్రజలు రోడ్ల మీదికి రావడం, గ్రూప్ వన్ విద్యార్థులు, త్రిబుల్ ఆర్ నిర్వాసితులు రోడ్లనెక్కడం ఇలా అన్ని వర్గాల ప్రజలు రోడ్లమీదకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అనాలోచిత విధానాలు, ప్రణాళికల రూపకల్పన విఫలం కావడం వల్ల తెలంగాణ రాష్ట్రం సమస్యల సుడిగుండంలో పడిందన్నారు.
రోజుకో డ్రామాతో డైవర్షన్ రాజకీయాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. మసిపూసి మారేడు కాయ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రేవ్ పార్టీ అనే కొత్త డ్రామాను తేరమీదికి తీసుకొచ్చి కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండకడుతున్న తన్నీరు హరీష్ రావుని, కేటీఆర్ ను ఎదుర్కొనే దమ్ము లేక పార్టీల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తగిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.