- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అర్ధరాత్రి మహిళా హాస్టల్‌లోకి దూరిన స్టార్ అథ్లెట్
దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అచంత షూలి చిక్కుల్లో ఇరుక్కున్నాడు. అతను మహిళా హాస్టల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించి పట్టుబడటం సంచలనంగా మారింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్(ఎన్‌ఐఎస్) పటియాలాలో పురుషుల, మహిళల అథ్లెట్లకు వేర్వేరుగా హాస్టల్స్ ఉన్నాయి. ప్రస్తుతం మహిళా బాక్సర్లు, అథ్లెట్లు, రెజ్లర్లు ఎన్‌ఐఎస్‌లో ఉన్నారు. అయితే, గురువారం అర్ధరాత్రి అచంత షూలి మహిళా హాస్టల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. గమనించిన భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకున్నారు. దీంతో అచంత షూలిపై ఇండియన్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్(ఐడబ్ల్యూఎల్ఎఫ్) వేటు వేసింది. పారిస్ ఒలింపిక్స్ సన్నాహక క్యాంప్ నుంచి బహిష్కరించింది. ‘క్రమశిక్షణారాహిత్యాన్ని సహించం. అచంత నుంచి క్యాంప్ నుంచి వెళ్లిపోవాలని చెప్పాం.’ అని ఐడబ్ల్యూఎల్‌ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు.
అచంత షూలి హాస్టల్‌కు వెళ్లడం, పట్టుబడటం భద్రతా సిబ్బంది వీడియో తీశారు. ఈ వీడియోను ఎన్‌ఐఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) వినీత్ కుమార్‌కు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) హెడ్ క్వార్టర్స్‌కు, ఐడబ్ల్యూఎల్ఎఫ్‌కు పంపించినట్టు సాయ్ వర్గాలు తెలిపాయి. అచంత షూలి బహిష్కరణపై ఎన్‌ఐఎస్ ఈడీ వినీత్ కుమార్ స్పందిస్తూ.. వీడియో సాక్ష్యం ఉన్నందున, సాయ్ ఎలాంటి విచారణ కమిటీని ఏర్పాటు చేయడం లేదని తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన 22 ఏళ్ల అచంత షూలి భారత వెయిట్‌లిఫ్టింగ్‌లో స్టార్‌గా ఎదిగాడు. పురుషుల 73 కేజీల కేటగిరీలో పోటీపడుతున్న అతను బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్-2022లో గోల్డ్ మెడల్ సాధించడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం అతను పారిస్ ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్నాడు. అయితే, నేషనల్ క్యాంప్ నుంచి బహిష్కరణకు గురవడంతో ఈ నెలలో థాయిలాండ్‌లో జరిగే ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నీ అయిన వెయిట్‌లిఫ్టింగ్ వరల్డ్ కప్‌లో అతను పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో అతని ఒలింపిక్ ఆశలు ప్రమాదంలో పడ్డాయి.
- Tags
- #Achinta Sheuli