- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ యువ క్రికెటర్‌ను గంగూలీతో పోల్చిన ఇర్ఫాన్ పఠాన్
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ దాదాపు ఓపెనర్‌గా స్థిరపడిపోయాడు. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల్లోనూ సత్తాచాటాడు. సిరీస్‌లో ప్రస్తుతం అతను 321 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. తాజాగా ఈ యువ సంచలనంపై భారత మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఏకంగా దిగ్గజ క్రికెటర్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో పోల్చాడు.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న పఠాన్ జైశ్వాల్ గురించి మాట్లాడాడు. ఆఫ్‌సైడ్ షాట్లు ఆడే విషయంలో జైస్వాల్, గంగూలీ మధ్య చాలా పోలికలున్నాయని చెప్పాడు. ‘నేను ఒక ఆటగాడు ఆడితే చూడాలని ఉత్సాహంగా ఉన్నాను. అతను యశస్వి జైశ్వాల్. ఐపీఎల్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి. అతను అద్భుతమైన ఆటగాడు. సౌరవ్ గంగూలీలాగా జైశ్వాల్ కూడా ఆఫ్ సైడ్ ఆడతాడు. గతంలో దాదాను ‘ఆఫ్ సైడ్ కింగ్’ అని పిలిచేవాళ్లం. మరో పదేళ్లు జైశ్వాల్ ఆడితే.. గంగూలీ ఆట గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో.. జైశ్వాల్ గురించి కూడా అలాగే చెప్పుకుంటాం. జైశ్వాల్ అలాంటి ఆటగాడు. అతను ఇప్పటికే డబుల్ సెంచరీ కొట్టాడు. అతడి వెనుక ఓ స్ఫూర్తిదాయక నేపథ్యం ఉంది.’ అని పఠాన్ చెప్పుకొచ్చాడు.