గొంతు నొప్పిని నిర్లక్ష్యం చేస్తున్నారా..? ఆ సమస్యలు వచ్చే చాన్స్!

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-11-22 15:40:32.0  )
గొంతు నొప్పిని నిర్లక్ష్యం చేస్తున్నారా..? ఆ సమస్యలు వచ్చే చాన్స్!
X

దిశ,ఫీచర్స్: శీతాకాలంలో గొంతునొప్పి అనేది సాధారణ విషయం అని చాలామంది అనుకుంటారు. వాతావరణంలో మార్పులు, తాగే నీరు మారినా వెంటనే గొంతు నొప్పి వస్తుంది. కొన్ని రకాల అలెర్జీలు కూడా గొంతు నొప్పిని ప్రభావితం చేస్తాయి. దీనితో పాటుగా జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. సాధారణం జలుబు వైరస్‌లు, మోనోన్యూక్లియోసిస్ వంటి వైరస్‌లు గొంతు ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి. ఈ గొంతు నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా గొంతు నొప్పితో ఇబ్బంది పడుతుంటే అది తీవ్రమైన సమస్యలకు కారణం కావొచ్చు. ఎక్కువ కాలంగా ఇలానే అనిపిస్తున్నట్లైతే వెంటనే వైద్యులను సంప్రదించండి.

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్:

గొంతు నొప్పి రావడానికి ప్రధాన కారణాల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఒక కారణం. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా గొంతు ఎర్రబడటం, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే, రుమాటిక్ ఫీవర్, కిడ్నీలో చీము, నెఫ్రైటిస్ వంటి సమస్యలకు కారణం అవుతుంది. అందుకే ఎక్కువ రోజులు గొంతు సమస్య ఉన్నట్లైతే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

క్యాన్సర్:

దీర్ఘకాలం పాటు గొంతు సమస్య ఉన్నట్లైతే అది క్యాన్సర్‌కు కారణం అవుతుంది. సాధారణంగా ఇది ఫారింక్స్ లేదా టాన్సిల్స్ నుండి ఏర్పడుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పొడి తగ్గు, మింగడం కష్టమనిపించడం, వాయిస్ మారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. దీనిని నిర్లక్ష్యం చేసినట్లైతే, పెదాలు, బుగ్గలు, చిగుళ్లు, అంగిలి, టాన్సిల్స్‌, నాలుకకు విస్తరిస్తుంది.

తీవ్రమైన అలెర్జీ:

కొన్ని సందర్భాల్లో గొంతు నొప్పి మంటను కలిగించవచ్చు. ఇది దుమ్ము, ఆహార అలెర్జీల కారణంగా వస్తుంది. ఇలాంటి లక్షణాలు అస్సలు నిర్లక్ష్యం చేయకండి.

వీటిని అస్సలు తినకూడదు:

గొంతు నొప్పి ఉన్నవారు నారింజ, నిమ్మ వంటి పుల్లటి పదార్థాలు తీసుకోకూడదు. ఇవి గొంతులో మరింత అసౌకర్యంను కలిగించే ప్రమాదం ఉంది. చాలామంది గొంతు నొప్పిని లెక్కచేయకుండా ఐస్‌క్రీమ్, శీతల పానియాలు, పెరుగు, వేయించిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. ఫలితంగా ఈ నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Read More...

Foot problems: పాదాలే మీ ఆరోగ్యాన్ని చెబుతాయి!





Advertisement

Next Story