AP Council: జగన్ పై మంత్రి సంచలన విమర్శలు.. మండలిలో రగడ

by Rani Yarlagadda |
AP Council: జగన్ పై మంత్రి సంచలన విమర్శలు.. మండలిలో రగడ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ శాసనమండలిలో (AP Legislative Council) వైసీపీ - కూటమి సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది. మంత్రి సవిత (Minister Savitha) వైసీపీ అధ్యక్షుడు జగన్ (YS Jagan) పై చేసిన సంచలన వ్యాఖ్యలే ఇందుకు కారణమైంది. మండలిలో రిజర్వేషన్లపై చర్చ జరుగుతుండగా.. గత ముఖ్యమంత్రి అయిన జగన్.. కాపులకు ద్రోహం చేశాడని విమర్శించారు. గత ప్రభుత్వ విధానాలతో చాలా మంది సోమరులు అయ్యారని, కాపులు, బ్రాహ్మణుల ద్రోహి వైసీపీ అని సంచలన విమర్శలు చేశారామె. భవనాలు నిర్మించడం అంటే రంగులు మార్చినంత సులువు కాదన్నారు.

మంత్రి సవిత జగన్ పై, వైసీపీ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై మండలిలో ఉన్న సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మంత్రి సవిత తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కూటమి, వైసీపీ సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది. దీంతో మంత్రి వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని ఛైర్మన్ ఆదేశించారు. ఆందోళనల మధ్యే శాసనమండలిని వాయిదా వేశారు.

Advertisement

Next Story

Most Viewed