- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాయుసేనలో అగ్నివీర్ వాయు పోస్టుల కోసంలో దరఖాస్తు చేసుకోవాలి : నిజామాబాద్ కలెక్టర్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : భారత వాయు సేన (ఇండియన్ ఎయిర్ ఫోర్స్)లో అగ్నివీర్ వాయు పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేశారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అర్హులైన యువతీ, యువకులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీ కోసం భారత వాయు సేన అర్హులైన అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండి, 2005 జనవరి 01 నుండి 2008 జూలై 01వ తేదీ మధ్యన జన్మించి ఉండాలన్నారు. అర్హులైన వారు 2025 జనవరి 07 నుండి జనవరి 27 వ తేదీ లోపు https://agnipathvayu.cdac.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి 2025 మార్చ్ 22 నుండి ఆన్ లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాకు చెందిన అర్హులైన యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.