Cyber: సైబర్ నేరానికి సాఫ్ట్ వేర్ ఉద్యోగి బలి.. 12 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు

by Ramesh Goud |
Cyber: సైబర్ నేరానికి సాఫ్ట్ వేర్ ఉద్యోగి బలి.. 12 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చేసి కోట్లు కొల్లగొడుతున్నారు. అమాయకులే కాక సాఫ్ట్ వేర్ ఉద్యోగులు(Software Employees) సైతం సైబర్ నేరాగాళ్ల వలలో పడటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే బెంగుళూరు(Bangalore)కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి సైబర్ నేరానికి(Cyber Crime) బలి అయ్యాడు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆ ఉద్యోగిని మోసగించి.. దాదాపు 12 కోట్లు(12 crores) కాజేశారు. ఇటీవల ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి డిజిటల్ అరెస్ట్(Digital Arrest) పేరుతో ఓ కాల్ వచ్చింది. మనీ లాండరింగ్ కేసులో(Money Laundering Case) చిక్కుకున్నావని.. కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు పంపాలని బెదిరింపులకు గురి చేశారు. దీంతో భయబ్రాంతులకు గురైనా ఆ ఉద్యోగి.. 17 రోజుల్లో దాదాపు 12 కోట్లు బదిలీ చేశాడు. మళ్లీ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో మోసపోయానని గుర్తించిన ఆ టెకీ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు సైబర్ నేరం కింద కేసు నమోదు ధర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed