- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మొదటిరోజు ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు

దిశ, మేడ్చల్ బ్యూరో : పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్ కుమారి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 230 సెంటర్లలో 47 వేల 469 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 161 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు. మొత్తంగా 47 వేల 195 రెగ్యులర్, 113 ప్రైవేట్ విద్యార్థులు తొలి రోజు పరీక్షకు హాజరు అయినట్లుగా తెలిపారు.
కుత్బుల్లాపూర్ లో అత్యధికంగా..
జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 మండలాల్లో 230 సెంటర్లను ఏర్పాటు చేయగా 41 సెంటర్లు కుత్బుల్లాపూర్ మండలంలో ఉన్న వివిధ పాఠశాలల్లో నిర్వహించారు. ఈ మండలంలో 8 వేల 599 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా వీరిలో 51 మంది విద్యార్థులు పరీక్ష రాయడానికి రాలేదు. జిల్లా వ్యాప్తంగా చూస్తే కుత్బుల్లాపూర్ మండలంలో అత్యధికంగా విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లుగా తెలుస్తుంది.