- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Stock Market: 1079 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

దిశ, బిజినెస్ బ్యూరో: గత నెల వరకు వరుస నష్టాలను చూసిన భారత ఈక్విటీ మార్కెట్లు తిరిగి లాభాల బాట పడుతున్నాయి. తాజాగా సోమవారం ట్రేడింగ్‌లో కీలక బ్యాంకింగ్, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి మన మార్కెట్లలో నిధులు పెట్టడం, భారత కరెన్సీ రూపాయి గణనీయంగా బలపడటం వంటి అంశాల కారణంగా సెన్సెక్స్ ఏకంగా 1,000కి పైగా పాయింట్లు పెరిగింది. వీటికి తోడు అమెరికా బాండ్ల రాబడి తగ్గడం వల్ల గ్లోబల్ మార్కెట్లలో మిశ్రమ ర్యాలీ కనిపించింది. దానివల్ల భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్లకు గిరాకీ పెరిగింది. ఓ దశలో సెన్సెక్స్ 78 వేల మార్కును అధిగమించినప్పటికీ ఆ తర్వాత కొంత బలహీనపడింది. ఈ ర్యాలీ కారణంగా మదుపర్ల సంపద ఒక్కరోజే రూ. 5 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెరిగింది. ఫలితంగా బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 418 కోట్లకు చేరుకుంది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,78.87 పాయింట్లు ఎగసి 77,984 వద్ద, నిఫ్టీ 307.95 పాయింట్లు లాభపడి 23,658 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్, రియల్టీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, కోటక్ బ్యాంక్, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు అధిక లాభాలను సాధించాయి. టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, జొమాటో, ఎంఅండ్ఎం, ఎయిర్‌టెల్ స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.58 వద్ద ఉంది.