Pooja Hegde: బాలీవుడ్ స్టార్ హీరోతో బీచ్‎లో ఎంజాయ్ చేస్తోన్న పూజా హేగ్డే.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Anjali |   ( Updated:2025-03-24 14:31:07.0  )
Pooja Hegde: బాలీవుడ్ స్టార్ హీరోతో బీచ్‎లో ఎంజాయ్ చేస్తోన్న పూజా హేగ్డే.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడు ముద్దుగుమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) అండ్ వరుణ్ ధావన్ (Varun Dhawan) ‘హై జవానీతో ఇష్క్ హూనా హై’ (Hai javanita iṣk huna hai) సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. రీసెంట్‌గానే వీరు రిషికేశ్‌(Rishikesh)లో ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాకు వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ (David Dhawan) దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 22 వ తేదీనే పూజా హెగ్డే.. వరుణ్ ధావన్‌తో కలిసి దీపాల్ని పట్టుకుని గంగా హారతి పట్టుకుని ఉన్న ఫొటోలు అభిమానులో పంచుకుంది.

ఇక హై జవానీతో ఇష్క్ హూనా హై మూవీ కోసం మూవీ టీమ్ రిషికేశ్ వెళ్లారు. ఈ క్రమంలోనే పనిలో పనిగా పరమార్థ నికేతన్ (Paramartha Niketan) ఆశ్రమాన్ని కూడా సందర్శించారు. అక్కడ రుద్రాక్ష మొక్కను నాటారు. గంగా హారతి ఇచ్చారు కూడా. ఇకపోతే తాజాగా పూజా హెగ్డే అండ్ వరుణ్ ధావన్ సోషన్ మీడియా వేదిక అయిన తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.

అందరినీ ఆకట్టుకుంటోన్న ఈ పోస్ట్‌లో వరుణ్ ధావన్, పూజా హెగ్డే బీచ్‌లో దూకుతున్నారు. ఈ పోస్ట్‌కు రిషికేశ్‌లో తదుపరి షెడ్యూల్‌తో కలుద్దాం అనే క్యాప్షన్ కూడా జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలోని జనాల్ని ఆకట్టుకుంటుంది.

Read More..

Niharika: తనలోని మరో ప్రతిభను బయటపెట్టిన మెగా డాటర్.. కూర్చోనే అలా చేస్తూ నెటిజన్లను ఫిదా చేసిందిగా..?



Next Story