- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రైతులను తక్షణమే ఆదుకోవాలి

దిశ, దేవరకద్ర: గత రెండు రోజులుగా కురుస్తున్న వడగండ్ల వర్షాల వల్ల పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందని పంటనష్టం జరిగిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీలో దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా తమ దేవరకద్ర నియోజకవర్గంలోని రెండు మండలాల్లో వడగండ్ల వర్షాలు పడడంతో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా మూసాపేట్ మండలం వేముల గ్రామంలో 223ఎకరాలు, చక్రపూర్ గ్రామంలో 82 ఎకరాలు, జానంపేట లో 20 ఎకరాలు, దాసరిపల్లి లో 65 తుంకిని పూర్ లో 32 ఎకరాలు మూసాపేట మండలంలో దాదాపు 422 ఎకరాలు, భూత్పూర్ మండలంలోని కర్వెన ,మదిగట్ల ,వెల్కిచర్ల గ్రామాల్లో కూడా వడగండ్ల వాన పడటం వల్ల చేతికొచ్చిన వరి పంట పెద్ద ఎత్తున నష్టం జరిగిందని తెలిపారు. కావున రైతులు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి చేతికొచ్చే సమయంలో పంట నష్టపోవడంతో.. రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని తెలిపారు. దయచేసి అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని వ్యవసాయ మంత్రిని కోరారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ.. తక్షణమే పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.