- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Peddi vs pushpa: రామ్ చరణ్ ‘పెద్ది’ పోస్టర్‌పై బన్నీ ఫ్యాన్స్ ట్రోలింగ్.. సేమ్ టు సేమ్ అంటూ..

దిశ, వెబ్ డెస్క్: Peddi vs pushpa: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 16వ సినిమా కావడం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రాబోతోంది.
అయితే ఈ మూవీలో రామ్ చరణ్ కు జోడిగా నటి జాన్వీకపూర్ నటిస్తున్నారు. ఇక నేడు చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చరణ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ తోపాటు టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ మూవీలో చరణ్ విభిన్నమైన లుక్ లో కనిపించనున్నట్లు పోస్టర్ ను బట్టి చూస్తే అర్థం అవుతోంది.
ఈ పోస్టర్ లో రాంచరణ్ గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో మాస్ లుక్ లో కనిపించడంతో ఈ మూవీపై భారీ అంచనాలే పెరిగాయి. అయితే కొంతమంది మాత్రం ఈ పోస్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అచ్చం ఈ మూవీలో రాంచరణ్ అల్లు అర్జున్ పుష్ప మూవీలో పుష్పరాజు గెటప్ లోనే కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాంచరణ్ బర్త్ డే సందర్భంగా రెండు పోస్టర్లను రిలీజ్ చేశారు. ఒకదాంట్లో అతను సేమ్ టు సేమ్ పుష్పలో అల్లు అర్జున్ వలే..మరో దాంట్లో కేజీఎఫ్ ఛాప్టర్ 1లో యశ్ లా కనిపిస్తున్నారు. నా ఒక్కడికేనా మీకు కూడా అలానే కనిపిస్తున్నాడా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంకొందరైతే బావమరిది సేమ్ టు సేమ్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఓ ఫ్యాన్ అయితే పెద్ది, పుష్ప పోస్టర్లలోని రామ్ చరణ్, అల్లు అర్జున్ ముఖాలను సగం సగం చేసి పెట్టాడు. ఇందులో ఇద్దరూ దాదాపు ఒకేవిధంగా కనిపిస్తున్నారు. ఇలా బుచ్చిబాబు తన గురువు నుంచి పుష్ప లుక్ కాపీ కొడుతూ పెద్ది కోసం వాడుతున్నారన్నమాట అంటూ ఇంకొంతమంది దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.
Naku okkadikena meku kuda #Pushpa first look gurthochinda 🙇🏻♂️ #Peddi pic.twitter.com/d7jSp5WMcq
— Insane Icon (@icon_trolls) March 27, 2025