Kunal Kamra: ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు కష్టాలు

by Shamantha N |
Kunal Kamra: ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు కష్టాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా వివాదాల్లో నిలిచాడు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు చెందిన యూనికాంటినెంటల్‌ హోటల్‌లోని హాబిటాట్‌ క్లబ్‌కు కష్టాలు మొదలయ్యాయి. దానిలోని ఆక్రమణలు తొలగించేందుకు బీఎంసీ (బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌) ఉద్యోగులు ఖార్‌ వద్దకు వెళ్లారు. ఆ స్టూడియో అక్రమ నిర్మాణమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్‌ సర్నైక్‌ అన్నారు. దానిపై చర్యలు తీసుకోవాలని ముంబై కమిషనర్‌ను కోరినట్లు వెల్లడించారు. ఆక్రమణల తొలగింపుపై అసిస్టెంట్‌ కమిషనర్‌ వినాయక్‌ విస్పుటే స్పందించారు. స్టూడియో యజమాని కొన్ని అక్రమ షెడ్లను నిర్మించారని చెప్పారు. వాటిని తొలగించామని.. దానికి నోటీసులతో పనిలేదన్నారు. అసలు స్టూడియో ప్లాన్‌ను కూడా పరిశీలించి చర్యలు తీసుకొంటామని తెలిపారు.

కునాల్ ఏమన్నారంటే?

ఇటీవల హబిటాట్‌ స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్‌ షిండేపై కునాల్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ద్రోహితో పోల్చాడు. ఈ సందర్భంగా ‘దిల్‌ తో పాగల్‌ హై’ అనే హిందీ పాటలోని లిరిక్స్ ని పాలిటిక్స్ కు అనుకూలంగా మార్చి అవమానకర రీతిలో పాడాడు. దీంతో, శివసేన షిండే వర్గం కార్యకర్తలు స్టూడియోపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీంతో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా, పోలీసులు సోమవారం కునాల్‌పై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ప్రస్తుతం బీఎంసీ ఉద్యోగులు భారీ పనిముట్లతో అక్కడకు చేరుకొని స్టూడియోలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు మొదలుపెట్టారు. ఇకపోతే, కునాల్ కమ్రామ షిండేకు క్షమాపణలు చెప్పాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చిచెప్పారు. అయితే, దీనిపైనా కునాల్ స్పందించారు. ఈ వ్యవహారంతో పశ్చాత్తాప పడట్లేదని.. కోర్టు ఆదేశిస్తే క్షమాపణలు చెబుతానని అన్నారు.

Next Story

Most Viewed