Irregular periods: పీరియడ్స్ టైంకు రాకపోవడానికి మీకుండే ఈ 5 సమస్యలే కారణం..?

by Anjali |   ( Updated:2024-12-23 14:05:42.0  )
Irregular periods: పీరియడ్స్ టైంకు రాకపోవడానికి మీకుండే ఈ 5 సమస్యలే కారణం..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి మహిళ ఎదుర్కొనే సమస్యల్లో పీరియడ్స్ ఒకటి. ప్రతి నెల ఆడపిల్లలు ఈ సమస్యను ఫేస్ చేస్తుంటారు. ఆడవాళ్లలో జరిగే ఈ బుుతుస్రావం అనేది సహజమైన జీవ ప్రక్రియ. ఇది సాధారణంగా నెలకు ఒకసారి జరుగుతుంది. ఈ సమయంలో చాలా మంది ఆడవాళ్లకు తీవ్రగా కాళ్ల నొప్పి లేదా పొట్ట నొప్పి వస్తుంది. కొంతమంది మహిళల్లో తిమ్మిరి వంటి సమస్యలు కూడా కనిపిస్తుంటాయి. అయితే పీరియడ్స్ నెలసరి వస్తేనే ఆరోగ్యకరం. కొంతమందికి ఒక నెల వస్తుంది. మరో నెల పీరియడ్స్ రావు. అయితే ఇలా అవ్వడానికి కారణం జీవన శైలిలో మీరు చేసే పొరపాట్లే అంటున్నారు నిపుణులు. రెగ్యులర్ గా పీరియడ్స్ రాకపోవడానకి ఈ ఏడు కారణాలే అని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

తీవ్ర ఒత్తిడి..

ఒత్తిడి కారణంగా పీరియడ్స్ సమయానికి రావు. స్ట్రెస్పీ పీరియడ్స్ చక్రాన్ని నిర్వహించే హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. కాగా ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి లోనవ్వకూడదు.

సరిపడ నిద్ర..

నిద్ర సరిగ్గా లేకపోతే కార్టిసాల్, మెలటోనిన్ హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. పునరుత్పత్తి హార్మోన్ల బ్యాలెన్స్‌లో అవాంతరాలు ఏర్పడతాయి. కాగా రోజూ ఒకే సమయానికి పడుకుని.. ఒకే టైమ్ కు లేవడం అలవాటు చేసుకోవాలి.

విటమిన్ డి లోపం..

శరీరానికి విటమిన్ డి చాలా ముఖ్యం. ఐరన్, విటమిన్ డి లోపం ఉన్నట్లైతే.. అది హార్మోన్ల ఉత్పత్తిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. తద్వారా పీరియడ్స్ ను నియంత్రించడంలో తోడ్పడతుతాయి. కాగా విటమిన్ డి, ఐరన్ లోపం రాకుండా చూసుకోండి.

బరువు కారణంగా..

ప్రస్తుత రోజుల్లో చాలా మంది బరువు సమస్యతో బాధపడుతున్నారు. గంటల తరబడొ ఒకే దగ్గర కూర్చొని పని చేయడం కూడా వెయిట్ పెరగడానికి ఓ కారణమని చెప్పుకోవచ్చు. ఈ కారణంగా ఈస్ట్రోజెన్ లెవల్స్‌ను పెంచి.. రుతుచక్రంపై ఎఫెక్ట్ చూపుతుంది.

కార్బోహైడ్రేట్స్..

ఎక్కువగా పిండితో చేసిన వంటకాలు తినడం వల్ల బాడీలో ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తుంది. అంటే పాలిష్డ్ రైస్, కార్న్ ఫ్లోర్ వంటి వంటకాలు. ఇవి బాడీలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ సమత్యులను దెబ్బతీస్తుంది. ఈ కారణంగా పీరియడ్స్ రెగ్యులర్‌గా రావని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.


Read More..

Infant Care: చిన్నపిల్లలు తరచూ నాలుకను బయటపెట్టడానికి కారణం..!

Advertisement

Next Story