Caution Deposit: తిరుమలలో కాషన్ డిపాజిట్ పై క్లారిటీ ఇచ్చిన మంత్రి

by Rani Yarlagadda |
Caution Deposit: తిరుమలలో కాషన్ డిపాజిట్ పై క్లారిటీ ఇచ్చిన మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల (Tirumala)లో భక్తులకు కేటాయించే గదులపై తీసుకుంటున్న కాషన్ డిపాజిట్ పై ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి (Anam Ram Narayana Reddy) క్లారిటీ ఇచ్చారు. 10వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తిరుమల గదుల కేటాయింపుపై మాట్లాడిన ఆయన.. ఇకపై గదులకు తీసుకునే డిపాజిట్ పై సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు. కాషన్ డిపాజిట్ (Caution Deposit Refund)ను మూడు రకాలుగా భక్తులకు తిరిగి చెల్లిస్తున్నామని వివరించారు. తిరుమలలో కాషన్ డిపాజిట్ లేకపోతే గదులు దుర్వినియోగమవుతున్నాయని, అందుకే ఈ పద్ధతిని పాటిస్తున్నట్లు చెప్పారు. తిరుమల వచ్చే భక్తులకు 7600 గదులు అందుబాటులో ఉండగా.. వాటిలో 6200 గదులు సామాన్య భక్తులకు, 1400 గదులు వీఐపీలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతంలో భక్తులు గదులు ఖాళీ చేసిన గంటలోగానే కాషన్ డిపాజిట్ మొత్తాన్ని భక్తుల ఖాతాల్లో తిరిగి చెల్లించేవారు. కానీ.. ఇప్పుడు 48 గంటల సమయం పెడుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story