IPL : ఐపీఎల్ షెడ్యూల్ అనౌన్స్.. మూడు సీజన్ల డేట్స్ ప్రకటించిన బీసీసీఐ

by Sathputhe Rajesh |
IPL : ఐపీఎల్ షెడ్యూల్ అనౌన్స్.. మూడు సీజన్ల డేట్స్ ప్రకటించిన బీసీసీఐ
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే మూడు సీజన్లకు సంబంధించి షెడ్యూల్‌ను శుక్రవారం అనౌన్స్ చేసింది. ప్రారంభ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్‌ల డేట్స్ ప్రకటించింది. ఐపీఎల్‌కు వస్తున్న ఆదరణ మరింత పెంచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌కు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడనుంది. ఫ్రాంచైజీలు, ప్లేయర్లు తమ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడానికి వీలు కల్పించినట్లయింది. ఐపీఎల్-2025 సీజన్‌లో మ్యాచ్‌ల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయలేదు. మొత్తం 74 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. గత మూడు సీజన్లలో వినియోగించిన ఫార్మాట్‌నే ఈ సారి ఇంప్లిమెంట్ చేయనున్నట్లు క్రికెట్ బోర్డు తెలిపింది.

మూడు సీజన్ల షెడ్యూల్ ఇలా..

- ఐపీఎల్-2025 మార్చి 14 న ప్రారంభం మే 25న ముగింపు

- ఐపీఎల్ - 2026 మార్చి 15న ప్రారంభం, మే 31న ముగింపు

- ఐపీఎల్ - 2027 మార్చి 14న ప్రారంభం మే 30‌న ముగింపు

18వ ఐపీఎల్ ఎడిషన్ మరిన్ని డిటైల్స్..

- వచ్చే ఏడాది 18వ ఐపీఎల్ ఎడిషన్ మార్చి 14న ప్రారంభం

- డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం, నైట్ మ్యాచ్‌లు 7.30కు ప్రారంభం

- మ్యాచ్‌ బ్రాడ్‌క్యాస్టింగ్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ సొంతం చేసుకుంది. జియో, స్టార్ సంస్థలు విలీనం కావడంతో ఈ రెండు కంపెనీల చానెల్స్‌లో లైవ్ మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి.

- ఐపీఎల్ 2025 మ్యాచ్‌లను జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు

Advertisement

Next Story

Most Viewed