Nagavanshi: ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఎవరికీ ఉండదు: నిర్మాత

by Anjali |   ( Updated:2024-12-27 08:12:18.0  )
Nagavanshi: ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఎవరికీ ఉండదు: నిర్మాత
X

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నిర్మాత నాగవంశీ(Producer Nagavanshi) సినిమాల గురించి పలు విషయాలు మాట్లాడారు. ఏ నిర్మాత అయినా టికెట్ రేట్‌ను.. అతను పెట్టిన ఖర్చును, బయ్యర్లకు అమ్మిన రేట్‌ను ఆధారం చేసుకుని డిసైడ్ అవుతారని వెల్లడించారు. ఉదాహరణకు దేవర చిత్రానికి ఇంత ఖర్చు అయింది.. నాకు ఇంత కావాలని సర్కారును అడిగానని తెలిపారు. అలాగే పుష్ప-2 విషయంలో కూడా ఇలాగే జరిగిందని తెలిపారు. కానీ సినిమాల టికెట్ ధరల విషయంలో అయితే ఏ రేట్ సరైందో? కాదో చెప్పలేమని.. ఆ మూవీపై డిపెండ్ అయి ఉంటుందని నాగవంశీ వివరించారు.

కానీ ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టాలని ఏ నిర్మాతకు ఉండదని చెప్పుకొచ్చారు. ఒక ఏడాదిలో రెండు, మూడు మూవీలకే టికెట్ రేట్లు పెంచుతున్నామని వెల్లడించారు. ఇక ఈ సంవత్సరం టికెట్ రేట్లు పెంచిన సినిమాలు దేవర(Devara), కల్కి(Kalki), పుష్ప-2 (Pushpa-2) అని నాగవంశీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలాగే ఈ సందర్భంగా ప్రముఖ హీరోల సినిమాల గురించి మాట్లాడారు. సంక్రాంతి(Sankranti)కి థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు అన్నీ విజయం సాధించాలని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed