- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Harihara Veeramallu: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫస్ట్ సింగిల్ పై సూపర్ అప్‌డేట్..! (పోస్ట్)

దిశ, సినిమా: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ సినిమా ‘హరిహర వీరమల్లు’. జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతుంది. అయితే ఫస్ట్ పార్ట్ ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా 2025 మర్చి 28న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా ఈ మూవీ షూటింగ్ ఇప్పటి వరకు 80 శాతం పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.
న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేయనున్నారు. జనవరి 1న 12 గంటలకు ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేయనున్నారట. ఈ పాటను స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాడారట. తెలుగుతో పాటు మిగిలిన బాషల్లోనూ ఈ పాటను పవన్ పాడారన్నటుగా తెలుస్తోంది. అయితే.. ఈ పాట గురించి చిత్ర బృందం ఇప్పటి వరకు అయితే ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. ఇన్‌కేస్ ఇదే నిజమైతే పవన్ ఫ్యాన్స్‌కు కొత్త సంవత్సరం ప్రారంభానికి ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.