మన్మోహన్ సింగ్ జీవితం పై విడుదలైన సినిమా ఇదే.. ఆయన పాత్రను పోషించింది ఎవరంటే?

by Jakkula Mamatha |   ( Updated:27 Dec 2024 3:59 PM  )
మన్మోహన్ సింగ్  జీవితం పై విడుదలైన సినిమా ఇదే.. ఆయన పాత్రను పోషించింది ఎవరంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Former Prime Minister Manmohan Singh) (92) గురువారం రాత్రి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన ఢిల్లీలోని ఏయిమ్స్‌ (AIMS)లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వం (Central Government) అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు రేపు(శనివారం) అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లుగా అధికారులు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. అదేవిధంగా మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు.

భారత ప్రధానిగా పదేళ్ల పాటు సేవలందించిన మన్మోహన్ సింగ్(Manmohan Singh) జీవితంపై ఓ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. మన్మోహన్ సన్నిహితుడు సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’(The Accidental Prime Minister) పేరుతో ఈ మూవీని నిర్మించారు. ఇందులో మన్మోహన్ పాత్రను బాలీవుడ్ హీరో అనుపమ్ ఖేర్(Anupam Kher) పోషించగా.. సంజయ్ బారు(Sanjay Baru) పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. 2019 జనవరి 11న విడుదలైన ఈ చిత్రంలోని పలు డైలాగ్ లపై అప్పట్లో సర్వత్రా చర్చ జరిగింది.

Read More ...

Manmohan Singh.. సామాజిక న్యాయంపై లోతైన నిబద్ధత కలిగిన పాలన అందించారు: కమల్ హాసన్


Next Story