TG High Court: ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టు సంచలన ఆదేశాలు

by Shiva |   ( Updated:2024-12-27 08:40:35.0  )
TG High Court: ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టు సంచలన ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-కారు రేస్ కేసు (Formula E-Car Race) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనపై ఏసీబీ నమోదు చేసు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్‌ను ఈనెల 30 వరకు ఆరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంటూ కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. కేసులో ‘కేటీఆర్ నాట్ టు అరెస్ట్’ను ఎత్తివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా.. కౌంటర్ దాఖలు చేయాలంటూ కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే, కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరగా.. న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా ఈ నెల 31 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయకూడదని పోలీసులను ఆదేశించారు.

కాగా, బీఆర్ఎస్ సర్కార్ (BRS Government) హయాంలో హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా ఈ-కారు రేస్ (Formula E-Car Race) నిర్వహణలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదుపై ఏసీబీ (ACB) కేసు నమోదు చేసింది. అయితే, కేసులో అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) పేరును అధికారులు A1గా చేర్చారు. ఈ క్రమంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టు (High Court)లో క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రొసీజర్ ప్రకారం నోటీసులు ఇచ్చిన విచారణ చేపట్టాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed