పార్కింగ్ స్థలం లేక తిప్పలు..

by Sumithra |
పార్కింగ్ స్థలం లేక తిప్పలు..
X

దిశ, కొత్తూర్ : కొత్తూర్ మండల కేంద్రంలో పార్కింగ్‌ సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. జాతీయ రహదారి ఎన్హెచ్ 44 కు ఆనుకుని ఉన్న మండల కేంద్రం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వేల సంఖ్యలో ప్రజలు మండల కేంద్రానికి వస్తూ, పోతూ ఉంటారు. దీంతో ఎక్కువగా కిరణా షాపులు, ఫర్టిలైజర్ షాపులు ఉండే ప్రాంతాల్లో అడ్డదిడ్డంగా ఆటోలు, బైక్‌లను పార్కింగ్‌ చేయడంతో తీవ్ర ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. దీని వల్ల బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

మండల కేంద్రానికి వచ్చే ప్రజలు దాదాపుగా సొంత వాహనాలపైనే రావడంతో ఈ పార్కింగ్ సమస్య రోజు రోజుకు మరింత పెరిగిపోతోంది. అటు షాద్ నగర్ నుండి హైదరాబాద్ వెళ్లే రోడ్డు, ఇటు పెంజర్ల రోడ్డు పక్కనే ఉన్న షాపులు, హోటళ్ల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ అడ్డగోలు వాహనాల పార్కింగ్ వల్ల సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed