ప్రజావాణి దరఖాస్తుతో యువకుడికి అందిన ఎలక్ట్రికల్ ఆటో

by srinivas |
ప్రజావాణి దరఖాస్తుతో యువకుడికి అందిన ఎలక్ట్రికల్ ఆటో
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజావాణి కార్యక్రమం ద్వారా హైదరాబాద్ ఎర్రగడ్డకు చెందిన ఎస్సీ యువకుడు మేథరి అశోక్‌కు స్వయం ఉపాధికోసం ఎలక్ట్రికల్ ఆటోను అధికారులు సకాలంలో అందించారు. అశోక్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి ఎలక్ట్రికల్ ఆటోను అశోక్ తీసుకుని వచ్చి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ లను ఎలక్ట్రికల్ ఆటోలో ఎక్కించుకొని అశోక్ సవారీ చేశారు. అశోక్ ప్రజావాణి కార్యక్రమంలో తన పరిస్థితిని వివరిస్తూ ఎలక్ట్రికల్ ఆటో ను కొనుగోలు చేసేందుకు మూడు వారాల కిందట దరఖాస్తు చేసుకున్నాడు. హైదరాబాద్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ ద్వారా స్వయం ఉపాధి కోసం మేథరి అశోక్ కు ఎలక్ట్రికల్ వాహనం కొనుగోలు చేసేందుకు రుణం మంజూరైంది. వాహనాల డీలర్ వద్ద ఎలక్ట్రికల్ ఆటో రిలీజ్ కోటా మించి పోవడంతో ఆటో ఇవ్వడం కుదరదని డీలర్ చెప్పారు. ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ రవాణా శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ఎలక్ట్రికల్ ఆటోను రిలీజ్ చేయించారు. ఎలక్ట్రికల్ ఆటో ద్వారా రోజుకు ఒక వేయి రూపాయలు సంపాదించుకుంటు కుటుంబాన్ని పోషించుకుంటున్నాని మేథరి అశోక్ తెలిపారు. తనకు సాయం చేసిన రాష్ట్రప్రభుత్వానికి, అధికారులకు అశోక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed