Manipur : ఆగని హింస.. మణిపూర్‌‌‌కు మరో 10వేల సీఏపీఎఫ్ బలగాలు

by Hajipasha |   ( Updated:2024-11-23 09:53:58.0  )
Manipur : ఆగని హింస.. మణిపూర్‌‌‌కు మరో 10వేల సీఏపీఎఫ్ బలగాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : కుకీ, మెయితీ తెగలకు చెందిన మిలిటెంట్ల ఘర్షణతో మణిపూర్(Manipur) ఇంకా మండుతూనే ఉంది. గతేడాది మే నుంచి ఇప్పటివరకు 258 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈవిషయాన్ని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారు కుల్దీప్‌ సింగ్‌ వెల్లడించారు. ప్రజాప్రతినిధుల నివాసాలపై జరిగిన దాడులకు సంబంధించి 32 మందిని అరెస్టు చేశామన్నారు. దాదాపు 3వేల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికీ చాలా జిల్లాల్లో పరిస్థితులు అదుపులో లేవు. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(Centre Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదనంగా 10వేల మందికిపైగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలను(CAPF) మణిపూర్‌కు పంపుతామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. 90 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలలో దాదాపు 10వేల మంది సిబ్బంది ఉంటారని ఆయన వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వారిని మోహరిస్తామన్నారు. ఈవివరాలను కుల్దీప్‌ సింగ్‌ కూడా ధ్రువీకరించారు. ఇప్పటికే రాష్ట్రంలో 198 కంపెనీల బలగాలు ఉన్నాయన్నారు. మణిపూర్‌లోని అన్ని జిల్లాలతో పాటు రాజధాని ఇంఫాల్‌లోని శాంతిభద్రతల పరిస్థితులపై శుక్రవారం ఆయన ఇంఫాల్‌లో సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్మీ, పోలీసు, సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఎట్టకేలకు 9 డెడ్‌బాడీలకు అంత్యక్రియలు

నవంబరు 11న కుకీ మిలిటెంట్లు హత్య చేసిన 9 మంది మెయితీ వర్గీయుల డెడ్‌బాడీలకు అసోంలోని సిల్చార్ ప్రభుత్వ ఆస్పత్రిలో మూడు రోజుల క్రితమే పోస్టుమార్టం పూర్తయింది. చనిపోయిన వారి కుటుంబాలు ఆ డెడ్‌బాడీలను అసోం నుంచి మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాకు తీసుకొచ్చేందుకు భయపడిపోయాయి. చివరకు పోలీసులు ఇచ్చిన భరోసాతో తమ కుటుంబీకుల డెడ్‌బాడీలను అసోం నుంచి తీసుకొచ్చి శుక్రవారం ఉదయం జిరిబామ్ జిల్లాలో అంత్యక్రియలు నిర్వహించారు.


Read More..

Jarkhand: కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఇంటర్నెట్‌ను నిలిపివేయాలని కోరిన జేఎంఎం పార్టీ

Advertisement

Next Story

Most Viewed