IPOs: మరో రెండు ఐపీఓలకు సెబీ గ్రీన్ సిగ్నల్..!

by Maddikunta Saikiran |
IPOs: మరో రెండు ఐపీఓలకు సెబీ గ్రీన్ సిగ్నల్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market)లోకి ప్రవేశించేందుకు చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణ కోసం సంస్థలు క్యూ కడుతున్నాయి. తాజాగా మరో రెండు సంస్థలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లోకి వచ్చేందుకు రెడీ అయ్యాయి. రియాల్టీ సంస్థ కల్పతరు లిమిటెడ్(Kalpataru Limited), ఇంజినీరింగ్ కంపెనీ యూనిమెక్ ఏరోస్పేస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్(Unimech Aerospace and Manufacturing) ఇందులో ఉన్నాయి. కాగా ఈ రెండు కంపెనీలు ఐపీఓ కోసం ఆగస్టు(August)లో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) వద్ద దరఖాస్తు చేసుకోగా తాజాగా గ్రీన్ సిగ్నల్ లభించింది.

ఐపీవో ద్వారా కల్పతరు కంపెనీ సుమారు రూ. 1,590 కోట్లను ఆ సంస్థ సమీకరించనున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా తాజా ఈక్విటీ షేర్ల(Equity shares) ద్వారా ఈ నిధులను విక్రయించనున్నారు. ఐపీఓ నిధుల్లో రూ. 1,193 కోట్లను లోన్స్ కట్టేందుకు వెచ్చించనుంది. ఇక యూనిమెక్ ఏరోస్పేస్ ఐపీవోలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనుంది. ఐపీవో నిధులతో సంస్థ కొంత మేర మెషినరీ పరికరాల(Machinery Equipment) కొనుగోలుకు వినియోగించనుంది. కాగా ఐపీవోకు సంబంధించిన సబ్‌స్క్రిప్షన్‌ తేదీ, లాట్ సైజ్, షేర్ల ధర లాంటి వివరాలను ఈ రెండు కంపెనీలు త్వరలో వెల్లడించనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed