- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Hyderabad : ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఆపరేషన్ రోప్

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు పోలీసులు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆపరేషన్ రోప్(Operation Rope) పేరుతో నగరం అంతటా ఫుట్ పాత్స్ పై గల ఆక్రమణలను తొలగించనున్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(CV Anand) స్వయంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరం అంతటా ఫ్లైఓవర్లు, నిర్మాణాలు, వాహనాలు పెరిగాయి. పెరిగిన జనాభా, వాహనాలా రద్దీకి అనుగుణంగా రోడ్ల విస్తరణ పెరగడం లేదు. చిరువ్యాపారులు ఫుట్ పాత్ లను ఆక్రమించడం వలన పాదాచారులు రోడ్లపై నడుస్తున్నారు. పీక్ అవర్స్ లో ట్రాఫిక్ భారీగా పెరిగి పోవడానికి ఇది ఒక ప్రధాన కారణం. ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ నుంచి టోలిచౌకి మెజిస్టిక్ గార్డెన్ వరకు ఆపరేషన్ రోప్ చేపడుతుండగా.. దీనిని నగరం అంతటా విస్తరిస్తాం అని తెలియ జేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
- Tags
- cv anand