ఆ నాలుగు రైళ్లకు స్టాపింగ్ ఇవ్వండి.. రైల్వే మంత్రిని కోరిన పపన్

by srinivas |
ఆ నాలుగు రైళ్లకు స్టాపింగ్ ఇవ్వండి.. రైల్వే మంత్రిని కోరిన పపన్
X

దిశ, వెబ్ డెస్క్: పిఠాపురం(Pithapuram) మున్సిపాలిటీ సామర్లకోట – ఉప్పాడ(Samarlakota – Uppada) రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి(Railway Over Bridge) అవసరం ఉందని, సత్వరమే ఈ ఆర్వోబీని మంజూరు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌(Union Railway Minister Ashwini Vaishnav)కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో అశ్విని వైష్ణవ్‌తో సమావేశం అయ్యారు. పలు రైల్వే ప్రాజెక్టులు, ప్రజల అవసరాలపై చర్చించారు.

‘‘పిఠాపురం V-V సెక్షన్‌లో సామర్లకోట-ఉప్పాడ రోడ్డులో రైల్వే కి.మీ 640/30-32 వద్ద లెవెల్ క్రాసింగ్ నంబర్ 431కి బదులుగా ఆర్‌ఓబీ అవసరమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నిరంతరంగా ఉండే ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి, ఆ ప్రాంతంలో రోడ్‌ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఈ మౌలిక సదుపాయాల కల్పన చాలా అవసరం. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి 'గతి శక్తి' కార్యక్రమం ద్వారా మంజూరు చేయాలి.’’ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ని పవన్ కోరారు.

శ్రీపాద వల్లభ స్వామి(Sripada Vallabha Swamy) దేవాలయానికి వచ్చే భక్తుల కోసం 4 ముఖ్యమైన రైళ్ళకు పిఠాపురం రైల్వే స్టేషన్‌కు హాల్ట్ ఇవ్వాలని అశ్విని వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు. నాందేడ్ - సంబల్పూర్ నాగావళి ఎక్స్ ప్రెస్, నాందేడ్ - విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, విశాఖపట్నం- సాయి నగర్ షిర్డీ ఎక్స్‌ ప్రెస్, ఏపీ ఎక్స్ ప్రెస్ (విశాఖపట్నం - న్యూఢిల్లీ)కి పిఠాపురంలో హాల్ట్ అవసరమని తెలిపారు. అలాగే లాతూరు ప్రజలు చేసిన విన్నపాన్ని రైల్వే శాఖ మంత్రికి తెలియజేశారు. లాతూరు నుంచి తిరుపతికి రైలు ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరిన విషయాన్ని తెలిపారు. అలాగే ఈ ప్రతిపాదనపై పరిశీలన చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ని పవన్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed