- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం చర్యలు : ఎమ్మెల్యే కసిరెడ్డి
దిశ,ఆమనగల్లు::- మహిళా సంఘాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. మంగళవారం ఆమనగల్లు మండలం కోనాపూర్ గ్రామంలో ఇందిరా క్రాంతి పథకం ద్వారా 113 మంది మహిళలకు మంజూరైన పశువుల షెడ్డుల నిర్మాణానికి ఎంపీడీవో కుసుమ మాధురి తో కలిసి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మంజూరైన రూ 22.64 లక్షలతో ఈ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమనగలు ఏఎంసీ చైర్మన్ గీత నరసింహ,వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, పీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ వస్ఫూల శ్రీశైలం, డిసిసి అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు జగన్ తదితరులు పాల్గొన్నారు.