- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jarkhand: కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఇంటర్నెట్‌ను నిలిపివేయాలని కోరిన జేఎంఎం పార్టీ
దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌లోని అధికార జేఎంఎం పార్టీ శుక్రవారం రాత్రి ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. కౌంటింగ్ కేంద్రాలకు 2 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. బీజేపీ ఇతర రాష్ట్రాల నుంచి ఎలక్ట్రానిక్ నిపుణుల సాయంతో ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలను నిషేధించాలని జేఎంఎం డిమాండ్ చేసింది. 'బీజేపీ కౌంటింగ్ కేంద్రాల వెలుపల ఇతర రాష్ట్రాల నుంచి అత్యంత నైపుణ్యం ఉన్న ఎలక్ట్రానిక్ నిపుణులను నియమించిందని విశ్వసనీయ వర్గాల ద్వారా మాకు తెలిసింది. ఇది తీవ్రమైన విషయం' అని జేఎంఎం ప్రతినిధి సుప్రియో భట్టాచార్య ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీకి శనివారం రాష్ట్రంలోని 24 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కౌంటింగ్ కేంద్రాలకు 2 కి.మీ పరిధిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని, ప్రతి రౌండ్ కౌంటింగ్ తర్వాత లౌడ్ స్పీకర్ల ద్వారా ఫలితాలను ప్రకటించాలని కోరారు.