- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IDBI Recruitment: ఐడీబీఐ బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. అర్హత, జీతం వివరాలివే..!
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్(Recruitment) ద్వారా దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్(JAM) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.idbibank.in/ ద్వారా ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 30 నవంబర్ 2024. డిసెంబర్ లేదా జనవరిలో పరీక్షను నిర్వహిస్తారు.
పోస్టు పేరు, ఖాళీలు:
- జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 'ఒ' జనరల్ - 500
- అగ్రి అసెట్ ఆఫీసర్(AAO) స్పెషలిస్ట్ - 100
విద్యార్హత:
పోస్టును బట్టి బీఎస్సీ /బీఈ/బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉతీర్ణులై ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్/ ఐటీ అంశాల్లో ప్రావీణ్యం ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 1-10-2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ,ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు :
అన్ రిజర్వ్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 1050, ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులకు రూ. 250 ఫీజు ఉంటుంది.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ. 6.14 లక్షల నుంచి రూ. 6.50 లక్షల మధ్య జీతం ఉంటుంది.