- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Narendra Modi: ముగిసిన ప్రధాని విదేశీ పర్యటన
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) ఐదు రోజుల విదేశీ పర్యటన(foreign Visit) ముగించుకుని శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మూడు దేశాల్లో పర్యటించిన ఆయన 31 ద్వైపాక్షిక సమావేశాలు(Bilateral Meetings), సాధారణ భేటీలు నిర్వహించారు. ఇండియా నుంచి నేరుగా నైజీరియా వెళ్లిన ప్రధాని మోడీ అక్కడ ఆ దేశ రెండో అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించారు. అనంతరం, బ్రెజిల్‌లోని రియో డీజెనీరోలో నిర్వహించిన 19వ జీ20 సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సుకు హాజరైన దేశాధినేతలతో 10 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. బ్రెజిల్, ఇండోనేషియా, పోర్చుగల్, ఇటలీ, నార్వే, ఫ్రాన్స్, యూకే, చిలీ, అర్జెంటీనా, ఆస్ట్రేలియా దేశాల నాయకులతో సమావేశమయ్యారు. బ్రెజిల్ నుంచి ప్రధాని మోడీ గయానా చేరుకుని అక్కడా 9 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. 24వ తేదీన ఇక్కడ అఖిల పక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. 25వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.