- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > బిజినెస్ > Realme GT 7 Pro: గేమింగ్ యూజర్లే లక్ష్యంగా రియల్‌మీ నుంచి కొత్త ఫోన్ లాంచ్.. స్పెసిఫికేషన్ వివరాలివే..!
Realme GT 7 Pro: గేమింగ్ యూజర్లే లక్ష్యంగా రియల్‌మీ నుంచి కొత్త ఫోన్ లాంచ్.. స్పెసిఫికేషన్ వివరాలివే..!
by Maddikunta Saikiran |
X
దిశ, వెబ్‌డెస్క్: చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ(Realme) నుంచి కొత్త గేమింగ్ ఫోన్ భారత మార్కెట్లో విడుదలైంది. రియల్‌మీ జీటీ 7 ప్రో(Realme GT 7 Pro)పేరుతో దీన్ని లాంచ్ చేశారు. 12 జీబీ+256 జీబీ వేరియంట్ ధరను రూ. 59,999గా కంపెనీ నిర్ణయించింది. 16 జీబీ+512 జీబీ వేరియంట్ ధర రూ. 65,999గా పేర్కొంది. డస్ట్, వాటర్ రెసిస్టెంట్(Dust, water Resistant)లో దీన్ని మార్కెట్లోకి ప్రవేశ పెట్టారు. మార్స్ ఆరెంజ్, గెలాక్సీ గ్రే కలర్స్ లో లభిస్తుంది. నవంబర్ 29 నుంచి కస్టమర్లు అమెజాన్(Amazon), రియల్‌మీ వెబ్‌సైట్(Realme Website)లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎంపిక చేసిన కార్డులపై రూ. 3,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది.
రియల్‌మీ జీటీ 7 ప్రో ఫోన్ స్పెసిఫికేషన్ల వివరాలు..
- 6.78 అంగుళాల క్వాడ్ కర్వ్డ్ అమోలోడ్ డిస్‌ప్లే విత్ ఎకో2 ఓఎల్‌ఈడీ స్క్రీన్
- క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (Qualcomm Snapdragon 8 Elite ) ప్రాసెసర్ తో ఈ స్మార్ట్ ఫోన్ పని చేస్తుంది.
- ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది.
- 120Hz రిఫ్రెష్ రేట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో దీన్ని తీసుకొచ్చారు.
- ఏఐ స్కెచ్, సమ్మరీ, స్పీక్, రైటర్, బెస్ట్ ఫేస్ వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి.
- ఇక బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 టెలిఫోన్ లెన్స్ అమర్చారు.
- సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇందులో అమర్చారు.
- 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5800mAh కెపాసిటీ బ్యాటరీ కలిగి ఉంటుంది.
Advertisement
Next Story