TG Police: తెలంగాణ పోలీసుల స్పెషల్ ఆపరేషన్.. 23 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్

by Shiva |
TG Police: తెలంగాణ పోలీసుల స్పెషల్ ఆపరేషన్.. 23 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) విచ్చలవిడిగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు సులువుగా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెగబడుతున్నారు. వాట్సాప్ (Whatsaap), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాం‌లలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నిలువునా దోచేస్తున్నారు. క్యూఆర్ కోడ్స్ (QR Codes), వెబ్ లింకు (Web Links)లతో అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. కొరియర్ల పేరిట డిజిటల్ అరెస్టులు అంటూ బ్యాంక్ ఖాతాల్లోని డబ్బునంతా ఖాళీ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లు (Stock Markets), ట్రేడింగ్‌ (Trading)లో పెట్టుబడి పెడితే రెండింతలు లాభం వస్తుందని నమ్మించి ముంచేస్తున్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు తాజాగా తెలంగాణ పోలీసులు (Talangana Police) చెక్ పెట్టారు. సైబర్ క్రైమ్ (Cyber Crime) కేసుల్లో కీలక నిందితులుగా ఉన్న వారిని పట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), కర్ణాటక (Karnataka), ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh), గుజరాత్‌ (Gujarat)లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 23 మంది సైబర్ నేరగాళ్లను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై దేశ వ్యాప్తంగా 328 కేసులు, తెలంగాణలో 30 కేసుల్లో కీలక నిందితులుగా ఉన్నట్లుగా తేలింది. ఈ మేరకు నిందితుల నుంచి సెల్‌ఫోన్లు (Mobil Phones), చెక్‌ బుక్స్ (Check Books), సిమ్ కార్డు (SIM Cards)లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed