ఛ.. వీరు ఇక మారరు.. లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి

by Sridhar Babu |
ఛ.. వీరు ఇక మారరు.. లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి
X

దిశ, కరీంనగర్ టౌన్ : అవినీతి అధికారుల తీరు మారడం లేదు. ఏసీబీ అధికారులు పలుమార్లు దాడులు చేస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. తాజాగా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యదర్శి పురుషోత్తం, కార్యాలయం ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బాధితులు మహమ్మద్ అబ్దుల్ గఫూర్ అలియాస్ నిమ్మకాయల పాషా, సుల్తానా ఆబీర్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో శ్రీపాదరావు ఫ్రూట్స్ మార్కెట్ ఉంది. ఇందులో 12 మంది ఫ్రూట్స్ దుకాణాలను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం రెన్యువల్ చేసుకునేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ పురుషోత్తంను కలిశారు.

లైసెన్స్ రెన్యువల్ చేసేందుకు రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇవ్వలేమని వేడుకోగా చివరికి 60 వేలకు ఒప్పందం కుదిరింది. ఆ డబ్బులు అప్పగించారు. అయినా పురుషోత్తం లైసెన్సు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శనివారం రాత్రి నిమ్మకాయల పాషా, సెక్రటరీ పురుషోత్తం, ఇంచార్జ్ శ్రీనివాసరెడ్డికి డబ్బులు ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకొని పురుషోత్తం, శ్రీనివాస్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు.



Next Story