- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అనుమతులు లేని ప్రైవేటు పాఠశాల పై చర్యలేవి ?

దిశ, కాప్రా : నియోజకవర్గంలో అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలల పై తగిన చర్యలు తీసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అధికారులను కోరారు. శనివారం కాప్రా సర్కిల్ మల్లాపూర్ డివిజన్ గోకుల్ నగర్ లోని ఓ ప్రయివేటు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళనకు ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. యాజమన్య వైఖరి కారణంగా విద్యార్థుల చదువులకు అంతరాయం కలుగుతోందని, పాఠశాల నూతన యాజమాన్యం విద్యాశాఖ అనుమతులు లేకుండానే తరగతులు నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అనుమతులు లేకుండానే లెక్కలేనన్ని ప్రైవేటు పాఠశాలలు కొనసాగుతున్నా విద్యాశాఖ అధికారులు ఏలాంటి చర్యలు చేపట్టకపోవడం పై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్నారు. ప్రయివేటు పాఠశాల సమస్యను పరిష్కరించి విద్యార్థులకు మంచి విద్యా బోధన జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. అయితే యాజమాన్యంలోని కుటుంబ కలహాల కారణంగా పాఠశాల సంక్షోభంలో ఉందని, మూతపడే పరిస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పాఠశాల యాజమాన్యంలోని కుటుంబ సభ్యుల మధ్య కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ వివాదాలు ముదిరి పాకాన పడటంతో పాఠశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాల ముందు ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు మాట్లాడుతూ "మేము మా పిల్లలను నమ్మి ఈ పాఠశాలలో చేర్పించాము. ఇప్పుడు యాజమాన్యం తమ వ్యక్తిగత సమస్యల వల్ల పిల్లల భవిష్యత్తును అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇది ఎంతవరకు సమంజసం ? మా పిల్లల చదువుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. పాఠశాల నూతన యాజమాన్యం మాత్రం పాఠశాల ప్రస్తుత వ్యవహారం కోర్టు పరిధిలో ఉందన్నారు. పాత యజమాన్యం అజిత్ రెడ్డి మాత్రం తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా బెదిరింపు చర్యలకు పాల్పడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు అన్నారు. సరైన ఉపాధ్యాయులు లేకుండానే పాఠశాలను నడిపిస్తూ విద్యార్థుల జీవితాలను ఆడుకుంటున్నారని, దీంతో తమ పిల్లలు చదువుల్లో పూర్తిగా వెనుకబడిపోతున్నారని పలుమార్లు పాఠశాల యజమన్యానికి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖాధికారులు స్పందించి అనుమతులు లేని పాఠశాలల పై తగిన చర్యలు చేపట్టాలని, తమ పిల్లలకు తగిన న్యాయం చేకూర్చాలని కోరుతున్నారు.