- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kajal Aggarwal: మరో బాలీవుడ్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన కాజల్ అగర్వాల్.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: అందాల తార కాజల్ అగర్వాల్ ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అయితే ఈ అమ్మడు కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే తన ప్రియుడితో పెళ్లి పీటలెక్కింది. ఆ తర్వాత ఒక బాబుకు జన్మనిచ్చింది. దీంతో సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది. ఇక ‘సత్యభామ’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘కన్నప్ప’ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ భామ లుక్‌ని రివీల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా కాజల్ పార్వతీ దేవీ పాత్రలో మెప్పించడానికి రెడీగా ఉన్నది.
ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం కాజల్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు ఓకే చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో హిందీ ప్రాజెక్టుకు ఈ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మరి ఆ సినిమా డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. కాజల్, బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే జంటగా నటిస్తున్న సినిమా ‘ది ఇండియా స్టోరీ’. చేతన్ డీకే దీన్ని తెరకెక్కిస్తుండగా.. సాగర్ బి. షిండే నిర్మిస్తున్నారు.
ఇక క్రిమిసంహారక ముందుల కంపెనీల్లో జరిగే కుంభకోణాల కథతో రాబోతున్న ఈ ఇంటెన్స్ డ్రామా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ ముంబాయిలో ప్రారంభమయింది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ.. శ్రేయాస్ తన ఇన్‌స్టా వేదికగా ఫొటోలను పంచుకున్నారు. ‘ది ఇండియా స్టోరీ జర్నీ స్టార్ట్ అయింది. మునుపెన్నడూ తెరపైకి రాని శక్తివంతమైన కథతో రాబోతున్నాం’ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.