Hydra: మారని ఆక్రమణదారుల తీరు.. లేక్ వ్యూ విల్లస్ పై హైడ్రా పంజా

by Ramesh Goud |   ( Updated:2025-01-10 04:42:55.0  )
Hydra: మారని ఆక్రమణదారుల తీరు.. లేక్ వ్యూ విల్లస్ పై హైడ్రా పంజా
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్(Hyderabad) చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా(Hydra) పంజా విసురుతోంది. ప్రభుత్వ భూమి కబ్జా చేసి, నిర్మాణాలు చేపట్టిన ఆక్రమణ దారులపై ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి కూల్చివేతలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోని మణికొండ(Manikonda) లోని నెక్నాంపూర్(Neknampur) లేక్ వ్యూ విల్లాస్(Lake View Villas) లో కూల్చివేతలు(Demolishes) మొదలు పెట్టింది. నెక్నాంపూర్ చెరువును కబ్జా చేసిన కబ్జాదారులు.. అక్రమంగా విల్లాస్ నిర్మించారు.

ఈ నిర్మాణాలను గుర్తించిన రెవెన్యూ(Revenue), జీహెచ్ఎంసీ(GHMC) అధికారులతో పాటు హెచ్ఎండీఏ(HMDA) అధికారులు గతంలోనే కూల్చివేతలు చేపట్టారు. ఇదివరకే మూడుసార్లు కూల్చివేసినా.. అక్రమణదారులు మళ్లీ యధావిధిగా నిర్మాణాలు చేపట్టారు. దీనిపై ఆగ్రహానికి గురైన హైడ్రా కమీషనర్(Hydra Commissioner) ఏవీ రంగనాథన్(AV Ranganath) అక్రమంగా నిర్మించిన విల్లాలను వెంటనే కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. రంగనాథ్ ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం ప్రారంభించారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed